యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2018లో విడుదలైన అరవింద సమేత ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెల్సిందే. ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ శైలికి భిన్నంగా ఉంటుంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ కావడంతో కామెడీకి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. అయినా కానీ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి ఎన్టీఆర్ తో కలిసి పనిచేయబోతున్నాడు.
అసలైతే ఈ సినిమా షూటింగ్ ఈ జులైలో మొదలుపెట్టాలని భావించారు. కానీ అనుకోకుండా కరోనా వైరస్ ప్రభావం కారణంగా ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్ కు కానీ ఆర్ ఆర్ ఆర్ పూర్తయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈలోగా మీడియం బడ్జెట్ స్థాయిలో ఒక సినిమాను పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. ఇదే విషయమై ఎన్టీఆర్ ను కలిసి విషయం చెప్పగా ఎన్టీఆర్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
వచ్చే ఏడాది సంక్రాంతి నుండి మన సినిమా షూటింగ్ ను మొదలుపెడదామని త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ అన్నట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ మధ్య షెడ్యూల్స్ గ్యాప్ లో ఈ సినిమా షూటింగ్ ను కూడా సమాంతరంగా చేస్తానని ఎన్టీఆర్ చెప్పాడట. దీంతో చేసేదేం లేక త్రివిక్రమ్ మరో సారి ఎన్టీఆర్ సినిమాపై కూర్చున్నట్లు తెలుస్తోంది.