ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఎక్కడా తగ్గట్లేదు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల లైనప్ విషయంలో చాలా పార్టిక్యూలర్ గా ఉంటున్నాడు. వరసపెట్టి క్రేజీ సినిమాల్లో నటిస్తూ తన ఇమేజ్ ను శిఖరాగ్రం దాటిస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఇంకా కొన్ని రోజులు షూటింగ్ చేస్తే ఆర్ ఆర్ ఆర్ నుండి ఫ్రీ అవ్వొచ్చు. ఎన్టీఆర్ ఇప్పటికే తన నెక్స్ట్ సినిమాను కూడా ప్రకటించి రెడీగా ఉన్న విషయం తెల్సిందే.

తనతో అరవింద సమేత సినిమా తీసి సూపర్ హిట్ అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేయనున్నట్లు రెండు నెలల క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా లాంచ్ కు లేట్ అవుతోంది. షూటింగ్స్ లేకపోయినా ఎన్టీఆర్ ఈ లాక్ డౌన్ ను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ రోజూ స్క్రిప్ట్ లో డెవలప్మెంట్స్ గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారి ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అయిన సినిమా ఇదేనని అంటున్నారు. మరో నెల రోజుల్లో స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుందని దాని తర్వాత డైలాగ్ వెర్షన్ కు త్రివిక్రమ్ వెళతాడని అంటున్నారు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట. హారిక అండ్ హాసిని, కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు.