బాబాయ్ సినిమాను అబ్బాయ్ చూసేశాడు

వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కానీ.. వివాదాలుచుట్టుముట్టాక.. అందరూ వేలెత్తి చూపించిన తర్వాత తెలివి తెచ్చుకొన్నట్లుగాకొందరు వ్యవహరిస్తుంటారు. తాజాగా తారక్ తీరు చూస్తే.. ఇంచుమించు ఇదేరీతిలో ఉందని చెప్పాలి. సంక్రాంతి పండగ సందర్భంగా చిరు.. బాలయ్యలచిత్రాలు పోటాపోటీగా విడుదల కావటం తెలిసిందే. ఇరువురికి ప్రతిష్ఠాత్మకంగామారిన ఈ సినిమాల్ని.. ఆయా వర్గాలకు చెందిన వారు ఉరుకులు పరుగులు పెట్టిమరీ సినిమాను చూసేశారు.

సినిమాను చూడటం ఆలస్యం.. తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేయటంతో పాటు..విపరీతంగా పొగిడేయటం కనిపిస్తుంది. తాత పేరును.. బాబాయ్ పేరును తనసినిమాల్లోనూ.. బయటా చెప్పుకునే తారక్.. శాతకర్ణి సినిమా ఎందుకుచూడలేదన్న ప్రశ్న సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఒకవైపు మెగాఫ్యామిలీ మొత్తం మెగాస్టార్ వెనుక నిలబడి.. ఆయన చిత్రాన్ని చూసేసిఅభినందిస్తుంటు.. తారక్ మాత్రం అందుకు భిన్నంగా సైలెంట్ గా ఉండటాన్నిపలువురు తప్పు పట్టేశారు.

చేతిలో సినిమాలేమీ లేకుండా.. ఖాళీగా ఉన్న వేళ.. శాతకర్ణి సినిమాను తారక్చూసేసి.. తన ఫీలింగ్ ను షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా? అన్న మాట సోషల్మీడియాతో పాటు వెబ్ సైట్లలోనూ ప్రముఖంగా దర్శనమిస్తున్న వేళ.. తారక్సీన్లోకి వచ్చేశారు. తానిప్పుడే శాతకర్ణి సినిమాను చూశానని.. సాహో నందమూరిబాలకృష్ణ అంటూ తనదైన శైలిలో పొగిడేశారు.

‘‘ఇప్పుడే సినిమాను చూశాను. సాహో నందమూరి బాలకృష్ణ.సాహో డైరెక్టర్ క్రిష్.సాహో గౌతమి పుత్ర శాతకర్ణి చిత్ర బృందం. ఇది ఒక తెలుగువాడి విజయం.తెలుగుజాతి గర్వించదగ్గ చిత్రం. చరిత్ర మరిచిన తెలుగు చక్రవర్తికి నీరాజనం’’అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టటమే కాదు.. క్రిష్ తో కలిసి దిగిన సెల్పీని ఫోస్ట్చేశారు. సినిమా విడుదలైన ఇన్ని రోజుల వరకూ తారక్ ఎందుకు వెయిట్చేసినట్లు? ఆ విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చి ఉంటే ఈ చర్చ ఇక్కడితోముగిసేది కదా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈ ప్రశ్నలపై తారక్రియాక్ట్ అవుతారంటారా?
https://www.youtube.com/watch?v=25wm_ibLsjs