‘బిగ్ బాస్’ దెబ్బకు నెంబర్ వన్ స్థానం..

బిగ్ బాస్’ షో మొదలై పది రోజులవుతోంది. కొందరు ఈ షో గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఇంకొందరు వేస్ట్ అంటున్నారు. రెస్పాన్స్ మిక్స్డ్‌గా ఉన్నప్పటికీ జనాలైతే బాగానే షో చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఎపిసోడ్లు బాలేదంటున్న వాళ్లు కూడా షో చూస్తున్న వాళ్లే అని గుర్తుంచుకోవాలి.

మరి షో బాగా లేదని మెజారిటీ ఆడియన్స్ చూడటం మానేస్తే అప్పుడు ఇది ఫ్లాప్ అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే ‘బిగ్ బాస్’ నిర్వాహకులు సానుకూల దృక్పథంతోనే ఉన్నారు. ఇవాళ ‘బిగ్ బాస్’ షోకు సంబంధించి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.

అందరూ అనుకున్నట్లే తొలి రోజు ఆరంభోత్సవానికి సంబంధించిన షోకు అదిరిపోయే టీఆర్పీ వచ్చింది. 16.18 రేటింగ్‌తో ఆ రోజు ‘స్టార్ మా’ ఛానెల్ తెలుగు టీవీ రంగంలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సినిమాల్ని పక్కన పెడితే.. టీవీ కార్యక్రమాల వరకు ఇది తెలుగు టీవీ చరిత్రలోనే ఇదే హైయెస్ట్ టీఆర్పీ అని కూడా చెబుతున్నారు.

రెండో వీకెండ్లో ఎన్టీఆర్ కనిపించిన రెండు ఎపిసోడ్లకూ మంచి టీఆర్పీ వచ్చిందని.. ఆ రోజుల్లో కూడా ‘స్టార్ మా’ నంబర్ వన్ స్థానంలో ఉందని అంటున్నారు. ఐతే వీక్ డేస్ టీఆర్పీ ఏమంత గొప్పగా లేదు. వీక్ డేస్‌లో యావరేజ్‌గా 9.24 రేటింగ్ వచ్చింది. ఓవరాల్‌గా చూసుకుంటే ‘బిగ్ బాస్’ తెలుగు షో వ్యూయర్ షిప్ ఆశాజనకంగానే ఉంది.