నాగార్జున సినిమాతో 48 కోట్లు వెనకేసాడు

ఓం నమో వెంకటేశాయ’ ట్రెయిలర్‌ చూస్తే ‘అన్నమయ్య’ క్రేజ్‌ని మళ్లీ క్యాష్‌ చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తోంది. అన్నమయ్య వచ్చి ఇరవయ్యేళ్లు దాటినా, మళ్లీ అప్పటి మేకింగ్‌ వేల్యూస్‌, ఆ కాలం గ్రాఫిక్స్‌తోనే దీనిని కూడా తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. సినిమాపై ఎలాంటి ఎక్సయిట్‌మెంట్‌ పెంచని ఈ ట్రెయిలర్‌ సంగతి అటుంచితే, ఈ చిత్రంతో నిర్మాత జేబులు మాత్రం బాగా నిండాయనేది ట్రేడ్‌ సమాచారం.

నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా సక్సెస్‌ని దృష్టిలో పెట్టుకుని, అన్నమయ్య ఫ్యాక్టర్‌, వెంకటేశ్వరస్వామి భక్తులు వగైరా విషయాలని పరిగణనలోకి తీసుకుని ఈ చిత్రం హక్కులకి భారీ మొత్తం చెల్లించినట్టు తెలిసింది. కేవలం డిస్ట్రిబ్యూషన్‌ ద్వారానే ఈ చిత్రానికి ముప్పయ్‌ అయిదు కోట్లకి పైగా బిజినెస్‌ జరిగిందట. ఇక శాటిలైట్‌ హక్కులనేమో ఈటీవీ సంస్థ పన్నెండున్నర కోట్లు పెట్టి తీసేసుకుంది.

అన్నమయ్య టీఆర్పీల గురించి రామోజీకి బాగా తెలుసు కనుక ఫలితం కోసం కూడా చూడకుండా ఈ చిత్రం హక్కులని ఈటీవీ సిద్ధాంతాలకి విరుద్ధంగా భారీ మొత్తం చెల్లించి కైవసం చేసుకున్నారు. సినిమా ఫలితం ఎలాగుంటుందో కానీ ఈ చిత్రం నిర్మాత జేబులైతే ఫుల్లుగా నింపేసింది. రిలీజ్‌ తర్వాత నలభై కోట్ల బిజినెస్‌ చేసినట్టయితే బయ్యర్లకీ సంతోషాన్నిస్తుంది.