స్పెషల్ డేట్ కు వకీల్ సాబ్ టీజర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ను వకీల్ సాబ్ గా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపిస్తాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. లాస్ట్ షెడ్యూల్ ను చిత్రీకరిస్తున్నారు.

ఈ నెలాఖరు లోగా సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వకీల్ సాబ్ ను సమ్మర్ లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముంది. ఇక పవన్ కు జోడిగా శృతి హాసన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. అంజలి, నివేతా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న వకీల్ సాబ్ ను దిల్ రాజు నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. వాటిలో ఒకటి 2021లోనే విడుదలవుతుంది.