నాని – త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కళ్యాణ్ – నాగ చైతన్య.. ఇంకెవరూ మిగల్లేదా??

రూమర్స్ పుట్టించడం అనేది సినిమాలకు కొత్తేమి కాదు. మీడియా కొత్త రకాల రూమర్లను పుట్టించడంలో ఆరితేరిపోయింది. అయితే ఆ రూమర్లు నమ్మేలా ఉంటేనే సేల్ అవుతాయి. లేదంటే ఎవరికి వారే కొట్టిపారేసే అవకాశముంది. అందుకే రూమర్లు పుట్టించడం కూడా ఒక ఆర్ట్ లా అయిపోయింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల షూటింగ్ లు జరగక, సినిమాలు విడుదలవ్వక కొత్త రూమర్లు పుట్టించేందుకు అవకాశం తగ్గిపోయింది. అందుకే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రూమర్లు వండి వార్చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక రూమర్ వింటుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇంతకీ అసలు విషయంలోకి వెళితే..

నాని, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగ చైతన్య, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుంది కొన్ని మీడియా చానళ్ళు కథనాల మీద కథనాలు ప్రచురిస్తున్నాయి. అయితే ఇందులో నాగ చైతన్య మాత్రమే హీరోగా నటిస్తాడని, వేరే హీరోకు కూడా సినిమాలో అవకాశముందని దానికి ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్, నాని ఉన్నారు కదా అన్న సందేహం రాక మానదు. అయితే వారిద్దరూ ఈ సినిమాలో నటించరట. నిర్మాతలుగానే ఉంటారట. ఇక దర్శకుడ్ని కూడా ఎంపిక చేయాలట. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడుగా అంటే ఆయన కూడా నిర్మాతనే అంటున్నారు. ఇంకా స్పెషల్ ఏమిటంటే ఈ చిత్రానికి దశరధ్ కథను అందిస్తున్నారట.

అసలు కాంబినేషన్ పరంగా వింటేనే కొత్తకొత్తగా ఉన్న ఈ రూమర్ వర్కౌట్ అవ్వడం మాట దేవుడెరుగు అసలు రూమర్ గా కూడా అనుకోవడానికి లేకుండా ఉంది.