ఇన్ సైడ్ న్యూస్: పవర్ స్టార్ నుండి ప్రశంసలు అందుకున్న నిధి అగర్వాల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న జానపద పీరియాడిక్ డ్రామాలో లీడ్ రోల్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి వివిధ పేర్లు ప్రచారంలోకి వచ్చినా హరహర వీరమల్లు అనే టైటిల్ కు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నట్లు సమాచారం.

రీసెంట్ గా వీరిద్దరి మధ్యా ఒక సాంగ్ ను కూడా చిత్రీకరించాడు క్రిష్. అంతే కాకుండా కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేసాడు. అయితే సాంకేతిక సమస్య కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఆగింది. అందుకని పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ లో నటిస్తున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం నిధి అగర్వాల్ నటనకు పవన్ కళ్యాణ్ ఫిదా అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్యా తీసిన కొన్ని సన్నివేశాల్లోనే నిధి అగర్వాల్ డెడికేషన్, హార్డ్ వర్క్ ను గమనించిన పవన్ కళ్యాణ్ ఇలాగే కష్టపడాలని సలహా ఇచ్చి మెచ్చుకున్నాడట. నిధి అగర్వాల్ ఈ ప్రశంసలకు ఫుల్ హ్యాపీగా ఫీలవుతోందిట.