క్రిష్ తో సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేసిన పవన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీలో దూకుడు చూపిస్తోన్న విషయం తెల్సిందే. వకీల్ సాబ్ ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోశియుమ్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న పీరియాడిక్ డ్రామా.

నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా వీరిద్దరి మధ్యా కొన్ని సీన్స్ ను, ఒక సాంగ్ ను పూర్తి చేసారు. ఇదిలా ఉంటే పవన్ – క్రిష్ సినిమాకు సంబంధించి రకరకాల రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాకు హర హర మహాదేవ, వీరమల్లు వంటి టైటిల్స్ ను ఇటీవలే స్పెక్యులేట్ చేస్తున్నారు. అంతకు ముందు విరూపాక్ష అనే టైటిల్ బాగా సర్క్యులేట్ అయింది.

అయితే వీటిలో ఏది నిజం కాదని తెలుస్తోంది. స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసాడట. ఈ చిత్రానికి హరి హర వీరమల్లు అన్న టైటిల్ ను పవన్ ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.