పలు ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను నటించే ప్రతి సినిమాలో అలీ పాత్ర ఉండాలని నేను కోరుకుంటాను. నాకు అలీతో నటించడం అంటే చాలా సరదా. అలీతో నటిస్తున్న సమయంలో మరియు అతడితో మాట్లాడుతున్న సమయంలో సమయం తెలియదు అన్నట్లుగా పవన్ చెప్పుకొచ్చాడు. ఇద్దరి మద్య అంత సన్నిహిత్యం ఉంది. అలాంటి ఇద్దరి మద్య విభేదాలు అంటూ ప్రచారం జరిగింది. ఇద్దరు కలిసి గతంలో మాదిరిగా సినిమాలు చేయడం లేదు. కారణం ఏమో కాని ఇద్దరి మద్య గ్యాప్ వచ్చింది అనుకుంటున్న సమయంలో మళ్లీ ఇద్దరు కలిశారు.
ఈనెల 18వ తారీకున పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా అలీ ఇంట పెళ్లి వేడుక జరిగింది. అలీ కుటుంబ సభ్యులు చాలా సమయం పాటు పవన్ తో సరదాగా గడిపారు. అలీ భార్య సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ తో అలీ భార్య మరియు పిల్లలు కలిసి దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలతో అలీ మరియు పవన్ మద్య ఉన్న విభేదాలు తొలగి పోయాయి అని.. ఇప్పటికి అయిన అలీ జనసేన పార్టీలో జాయిన్ అవుతాడా అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.