పరిషత్ ఎన్నికల విషయమై నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం అఖిల పక్ష సమావేశంను ఏర్పాటు చేసేందుకు సిద్దం అయ్యింది. నిన్న సాయంత్రం అన్ని పార్టీలకు నోటీసులు పంపించడం జరిగింది. అఖిల పక్ష సమావేశంకు హాజరు అవ్వాలంటూ ఈ సందర్బంగా అన్ని పార్టీలను కూడా ఎస్‌ఈసీ కోరింది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ తేదీలు విడుదల చేసి మళ్లీ ఇప్పుడు అఖిల పక్ష సమావేశం ఏంటీ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్రజస్వామిక నిర్ణయం అంటూ ఎస్‌ఈసీ అఖిల పక్షం మీటింగ్ ను జనసేన బహిష్కరిస్తుందని పేర్కొన్నాడు.
ఇప్పటికే పరిషత్ ఎన్నికల కోసం కొత్త నోటిఫికేసన్ ను వేయాల్సిందిగా కోర్టుకు జనసేన వెళ్లింది. ఆ విషయమై కోర్టు తీర్పు రాకుండానే ఎలా నోటిఫికేషన్ ను విడుదల చేస్తారంటూ జనసేనాని ప్రశ్నించాడు. పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలను నిర్వహించి అధికార పార్టీకి లబ్ది చేకూర్చే విధంగా ఉందని పవన్ కళ్యాణ్ ఆరోపించాడు. జనసేన ఆరోపణలపై ఎస్‌ఈసీ స్పందించాల్సి ఉంది.