పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ సోకింది. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదలైంది. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌజ్ కే పరిమితమైన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ కు దగ్గరగా పనిచేసే పలువురికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా ఫామ్ హౌజ్ లో ఉంటున్నాడు పవన్ కళ్యాణ్.
అయినా కానీ పవన్ కళ్యాణ్ కు కరోనా సోకినట్లు తెలియజేసారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు తన ఫామ్ హౌజ్ లోనే ఉంచి తగిన వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ ను కూడా అందిస్తున్నట్లు వివరించారు. పవన్ ఊపిరితిత్తుల్లో కొంత మేర నిమ్ము ఉందని, దానికి చికిత్స జరుగుతున్నట్లు తెలిపారు.
ఈ నెల 3న తిరుపతిలో జరిగిన పాద యాత్ర, బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న ఆయనకు నలతగా ఉండి కరోనా పరీక్షలు చేయించుకుంటే నెగటివ్ వచ్చింది. అయితే అప్పటినుండి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులుతో ఆయన బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్ అని తేలింది.
https://twitter.com/JanaSenaParty/status/138302048250976256