వుయ్ లవ్ కళ్యాణ్ బాబు.. ఇంతకీ ఇప్పుడెందుకు?

సడెన్ గా ట్విట్టర్ లో #welovekalyanbabu అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ కనిపించింది. ట్రెండ్ మొదలైన చాలా కొద్దిసేపట్లోనే ఈ హ్యాష్ ట్యాగ్ కు దాదాపు 23 వేల ట్వీట్స్ రావడం విశేషం. ఇంకా ఇది ట్రెండ్ అవుతోంది. అసలు ఈ హ్యాష్ ట్యాగ్ వెనకాల అర్థమేంటి. ఎందుకని సడెన్ గా మెగా అభిమానులు ఈ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు?

కంబ్యాక్ లో వరసగా సినిమాలను ఒప్పుకుని అభిమానులను అలరించాడు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ చిత్రాన్ని విడుదల చేసాడు. అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ చిత్రం, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, జేజే ఆర్ట్స్ లో ఒక మూవీ, రామ్ చరణ్ నిర్మాణంలో ఒక చిత్రం ఇలా చాలానే చిత్రాలకు కమిటయ్యాడు.

ఇటీవలే కరోనా బారిన పడి అందరినీ కలవరపాటుకు గురి చేసాడు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు కోలుకుంటున్నాడు. అందుకే ఈ హ్యాష్ ట్యాగ్.