జనసేనాని ప్రశ్న: ఉక్కు సంకల్పం.. ఏదీ ఎక్కడ.?

ప్రజలు, ప్రజా ప్రతినిథులు, రాజకీయ పార్టీలు లైట్ తీసుకుంటే, ఏ విషయమ్మీద అయినా, రాష్ట్రానికి ఎలా న్యాయం జరుగుతుంది.? అన్నది మొదటి నుంచీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్న. ప్రత్యేక హోదా విషయంలో అయినా, మరో విషయంలో అయినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయి. వీటిని ప్రతిసారీ జనసేనాని ప్రశ్నిస్తూనే వున్నారు.

ప్రత్యేక హోదా విషయాన్నే తీసుకుంటే, రాజకీయ పోరాటం.. ప్రజా పోరాటంగా మారినప్పుడే, ఏ ఉద్యమం అయినా విజయ తీరాలకు చేరుతుంది. తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యింది ఇందుకే. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ఆరంభ శూరత్వం’ తప్ప, లక్ష్యాన్ని ఛేదించాలన్న పట్టుదల కనిపించదు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో విభజన రాజకీయాలు నడుస్తాయ్. ఇదే విషయాన్ని నిన్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుండబద్దలుగొట్టేశారు.

ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కతాటిపైకి ఎందుకు రావడంలేదు.? విశాఖ ఉక్కు విషయంలో ఎందుకు అన్ని రాజకీయ పార్టీలూ కలిసి పోరాటం చేయడంలేదు.? అని జనసేన అధినేత ప్రశ్నించారు. పార్టీల వారీగా నాయకులు విడిపోయి, ప్రజా ప్రతినిథులు విడిపోయి, ప్రజలూ విడిపోతే.. పరిణామాలు ఇలాగే వుంటాయని జనసేన అధినేత చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో ఐక్యత లేకుండా కేంద్రాన్ని నిలదీసి ప్రయోజనం లేదన్నది జనసేన అధినేత చేసిన మరో ఆసక్తికరమైన వ్యాఖ్య. నిజమే మరి, వ్యవసాయ చట్టాలకు ఢిల్లీలో మద్దతిచ్చి, గల్లీలో ఆందోళనలు చేయడం.. అధికార వైసీపీకే చెల్లింది. ఇలాంటి రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయా.? ఛాన్సే లేదు.

వివాఖ స్టీలు ప్లాంటు విషయమై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి, ఆ బృందాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్ళి వుంటే, ఈ రోజు పరిస్థితి ఇంకోలా వుండేది. జనసేనాని ప్రజల్ని ప్రశ్నించారు, పార్టీలనీ, ప్రభుత్వాన్నీ ప్రశ్నించారు.. కానీ, ఇప్పుడు పెయిడ్ బ్యాచ్ రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ మీద మొరుగుతాయ్. ఎందుకంటే, వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు.. రాష్ట్రం పట్ల అస్సలు చిత్తశుద్ధి లేదు.