మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాడటం వైసీపీ గేమ్ ప్లాన్. అది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంగా విసిరేసింది. తెలుగుదేశం పార్టీ సంగతి సరే సరి.! ఐదేళ్ళు అధికారంలో వుండి ఏం చేసింది టీడీపీ.? అంటే, ‘ఇది చేశాం’ అని చెప్పలేని పరిస్థితి ఆ పార్టీది.
పొత్తుల విషయమై తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకే కాదు, భారతీయ జనతా పార్టీకి కూడా ఇవ్వాల్సిన స్థాయిలోనే స్పష్టత ఇచ్చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇంత స్పష్టత ఇచ్చేశాక కూడా, అర్థం కానట్లు అధికార వైసీపీ నటిస్తే, కళ్ళున్న కబోదులుగా ఆ పార్టీ నాయకుల్ని, బులుగు మీడియానీ, బులుగు కార్మికుల్నీ చూడాల్సి వస్తుందన్నది జనసైనికులు చెబుతున్నమాట.
ఇంతకీ, పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు.? జనసైనికులకు ఆయన ఓ స్పష్టతనిచ్చారు. జనసేన ముందున్న ఆప్షన్స్ ఏంటి.? అన్నదానిపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా చెప్పాల్సింది చెప్పేశారు. జనసేన ముందు మూడు ఆప్షన్స్ వున్నాయని చెప్పిన జనసేనా, అందులో ఓ ఆప్షన్ బీజేపీతో కలిసి వెళ్ళడం, రెండో ఆప్షన్ టీడీపీతో కలిసి వెళ్ళడం.. మూడోది సొంతంగా అధికారంలోకి రావడమని అన్నారు జనసేనాని.
బీజేపీతో ప్రస్తుతం కలిసే వుంది జనసేన. సో, అది ఆల్రెడీ నడుస్తున్న ఆప్షన్. టీడీపీతో పొత్తు అనేది ఇంకో ఆప్షన్. కానీ, ఆ ఆప్షన్ వర్కవుట్ అవ్వాలంటే, ‘బైబిల్ వాక్యాన్ని అనుసరించి’ తెలుగుదేశం పార్టీ తగ్గాలన్నది జనసేన అధినేత చెప్పిన మాట. ముచ్చటగా మూడోది, సొంతంగా అధికారంలోకి రావడం.
ఎలా చూసుకున్నా, జనసేన అధికారంలోకి రావడమన్నది స్పష్టంగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ మాటల్ని బట్టి. ‘వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలనివ్వను..’ అంటూ కొన్నాళ్ళ క్రితం జనసేనాని వ్యాఖ్యానిస్తే, దాన్ని పట్టుకుని ఇప్పటికీ వైసీపీ గింజుకుంటూనే వుంది. ఇకపై గింజుకోవడానికేమీ లేదు. వైసీపీని చావు దెబ్బ కొట్టేశారు జనసేనాని, ‘మూడు ఆప్షన్స్’ వ్యవహారంతో.
ఆల్రెడీ వైసీపీ నుంచి మొరుగుడు షురూ అయ్యింది. అలా మొరగకపోతే, అధినేత నుంచి చీవాట్లు తప్పవ్.! కానీ, జనసేనాని ఏం చెప్పారో జనానికి అర్థమయ్యింది. ‘మేం ప్రజల్ని పల్లకీ ఎక్కించాలనుకుంటున్నాం..’ అని ఇంకోసారి స్పష్టం చేసేశారు జనసేనాని.