పవన్‌కళ్యాణ్‌కి మూడ్ లేకపోతే షూటింగ్‌కి కూడా రాడని, ఒకవేళ సెట్లో వున్నా కానీ తనకి నటించే ఆసక్తి లేకపోతే ప్యాకప్ చెప్పేసి వెళ్లిపోతాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తుంటాయి. అందుకే అతనితో బాగా ర్యాపో వున్న దర్శకులతో చిత్రాల్లోనే పవన్ యాక్టివ్‌గా కనిపిస్తుంటాడని, లేదంటే ఏదో పేరుకి నటించేసి వెళ్లిపోతాడని కూడా అంటారు. సినిమాలు వదిలేసి రాజకీయాలకు పరిమితం కావాలని అనుకున్న పవన్‌కళ్యాణ్‌కి ఆ రంగంలో కనీసం ఎమ్మెల్యేగా బిజీగా వుండే వీలు చిక్కలేదు.
దీంతో అయిదేళ్ల విరామం వుండడంతో మరోసారి పవన్‌కళ్యాణ్ సినిమాల వైపు వచ్చాడు. నటించే ఆసక్తి లేకపోయినా కానీ తనకున్న మార్కెట్, నిర్మాతలు ఆఫర్ చేస్తోన్న రెమ్యూనరేషన్ సినిమాలను సీరియస్‌గా తీసుకునేట్టు చేసాయి. దీక్షగా షూటింగ్స్ చేస్తూ ఎలాంటి డైవర్షన్స్ లేకుండా వున్న టైమ్‌లో కరోనా బ్రేక్ వచ్చి పవన్ మూడ్ పాడు చేసింది. దాంతో మళ్లీ పవన్ సినిమాల నుంచి డైవర్ట్ అయిపోయాడు.
ఇప్పుడు అతడిని తిరిగి ట్రాక్ మీదకు తీసుకొచ్చి బ్యాలెన్స్ షూటింగ్ చేయడానికి నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అక్టోబర్‌లో అయినా ‘వకీల్ సాబ్’ మిగతా భాగం షూటింగ్ పూర్తి చేసేసి సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు ఆశపడితే, పవన్ ప్రస్తుత మైండ్‌సెట్‌తో అది సాధ్యం కాదని, ఈ దీక్షలూ గట్రా పూర్తి చేసి, మళ్లీ మామూలు అవడానికి కనీసం డిసెంబర్ అవుతుందని, అంటే వకీల్‌సాబ్ వచ్చే వేసవి సీజన్‌లోనే రావాలి తప్ప ముందు వచ్చే సూచనలు లేవని టాక్ ఉంది.