‘వకీల్ సాబ్’ షూటింగ్ కి సై అన్న పవన్ కళ్యాణ్ – శృతి హాసన్.!

జనసేనాని అలియాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత కంబ్యాక్ ఫిల్మ్ గా చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. పవన్ రెండు విభిన్న గెటప్స్ లో లాయర్ గా కనిపించనున్న ఈ సినిమా లాక్ డౌన్ సమయానికి 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో 25 రోజులు షూట్ చేస్తే వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ ఫినిష్ అవుతుందని ఇది వరకే తెలిపాము.

ఇటీవలే వకీల్ సాబ్ టీం మెయిన్ స్టార్స్ లేకుండా మిగిలి ఉన్న సీన్స్ కి సంబందించిన షూటింగ్ ని మొదలు పెట్టారు. అంజలి కూడా ఈ షూట్ లో పాల్గొంది. ముఖ్యంగా ఈ ఫైనల్ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ మీద వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని షూట్ చేయాల్సి ఉంది. ఆ షూట్ ఎప్పుడు జరుగుతుందో అనే విషయంతో పాటు మరో రెండు విశేషాలను కూడా మేము తెలుసుకున్నాం.

పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ లపై వచ్చే ఎపిసోడ్స్ ని అక్టోబర్ 26 నుంచి మొదలు పెట్టనున్నారు. ఒకే షెడ్యూల్ లో మొత్తం ఫినిష్ చేస్తారు. ఆ తర్వాత బాలన్స్ ఉన్న పీకే కోర్ట్ సీన్స్ ని కూడా నవంబర్ చివరికల్లా ఫినిష్ చేసి షూట్ కి పాకప్ చెప్పనున్నారు. ఇప్పటికే జరిగినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ అయ్యింది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ డిసెంబర్ లో ఫినిష్ చేసి అనుకున్నట్టుగా 2021 సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అంజలి, నివేత థామస్ ముఖ్యపాత్రల్లో పోషిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘పింక్’ సినిమాకి రీమేక్.