పవన్‌ పై ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలకు నాగబాబు సీరియస్‌ కౌంటర్‌

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ ఊసరవెల్లి మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు అంటూ నటుడు ప్రకాష్‌ రాజ్‌ చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబు కావు అంటూ జనసేన కార్యకర్తలు మరియు సినీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తనకంటూ ఒక పార్టీని పెట్టుకుని వేరే పార్టీని మోయడం ఎందుకు అంటూ పపవన్‌ కళ్యాణ్‌ ను ఉద్దేశించి ప్రకాష్‌ రాజ్‌ చేసిన వ్యాఖ్యలపై నేరుగా నాగబాబు సమాధానం చెప్పాడు. నాగబాబు తనదైన శైలిలో చాలా అగ్రెసివ్‌ గా చాలా కోపంతో సమాధానం చెప్పాడు. ట్విట్టర్‌ లో నాగబాబు సుదీర్ఘ పోస్ట్‌ను పెట్టిన నాగబాబు ప్రకాష్‌ రాజ్‌కు ఇచ్చిన సమాధానం పట్ల జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాగబాబు తన పోస్ట్‌లో.. రాజకీయాల్లో నిర్ణయాలు అనేక సార్లు మారుతూ ఉంటాయి. ఆ నిర్ణయాల వెనుక లాంగ్ టర్మ్‌ పార్టీ మరియు ప్రజల ప్రయోజనాలు ఉంటాయి. మా నాయకుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి. పార్టీకి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని కార్యకర్తలకు కూడా తెలుసు. పవన్‌ ద్రోహం చేశాడని ప్రతి పనికి మానికిమాలిన వాడు కామెంట్‌ చేస్తున్నారు. నీ రాజకీయ డొల్లతనం ఏంటో బీజేపీ లీడర్‌ సుబ్రమణ్యస్వామితో చర్చ సందర్బంగా అర్థం అయ్యింది. బీజేపీ తీసుకున్న నిర్ణయాలు నీకు ఇష్టం లేకుంటే ఖచ్చితంగా విమర్శించు. కాని బీజేపీ కాని మరే పార్టీ కాని ప్రజలకు మంచి చేసే నిర్ణయం తీసుకుంటే హర్షించగలగాలి. విమర్శించడం తప్ప నీకు హర్షించడం చేతనవ్వదు. ఈ దేశానికి బీజేపీతో ఏపీకి జనసేనతో అభివృద్ది సాధ్యం.

నీలాంటి కుహానా మేధావులు ఎన్ని వాగినా కూడా జనసేన బీజేపీ కూటమి శక్తిని ఆపలేరు. నిర్మాతలను ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశావో నాకు తెలుసు. దర్శకులను మచ్చిక చేసుకుని నిర్మాతల నుండి డబ్బులు గుంజిన రకం నీవు. అలాంటి నీవు పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల గురించ మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్‌. బీజేపీ నాయకత్వం గురించి నువ్వు నోటికి వచ్చినట్లుగా మాట్లాడినా కూడా వారు పట్టించుకోక పోవడంకు కారణం ప్రజాస్వామ్యంకు వారు ఇచ్చే గౌరవం అని నీవు అర్థం చేసుకో. మీడియా అడిగింది అని ఒళ్లు పొంగి పనికిమాలిన మాటలు మాట్లాడొద్దు.. నీ రాజకీయ డొల్లతనాన్ని బయట పెట్టవద్దు అంటూ నాగబాబు ట్వీట్‌ చేశాడు.