హీరోయిన్ల కష్టాలు తీరుస్తున్న ప్రధాని మోడీ!

ఇళ్లల్లో బందీలు అయిపోవడంతో హీరోయిన్లు ఫోటో షూట్స్ చేసుకునే వీల్లేకపోయింది. దీంతో ఇంస్టాగ్రామ్ ఎప్పుడు అప్డేటెడ్ గా ఉంచే హీరోయిన్లు ఏమి పెట్టాలో తెలియక హోమ్ వర్కౌట్ వీడియోలు, ఫోటోలు, కుక్కలు, పిల్లులతో దిగిన ఫోటోలు పెడుతున్నారు. ఇలా ఎన్ని రోజులని పెడతారు.

ఏదైనా కొత్తదనం చూపించాలి కదా పాపం. వీరికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్న టాస్కులు వరంగా మారాయి. చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అంటూ మోడీ ఇస్తున్న టాస్కులు సగటు జనం పాటిస్తున్నా లేకపోయినా కానీ సెలెబ్రిటీలు మాత్రం విధిగా పాటిస్తున్నారు. అంతే కాకుండా ఆ ఫోటోలు, వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు.

మళ్ళీ ఆదివారం వస్తూ ఉండడంతో అయన ఇచ్చే నెక్స్ట్ టాస్క్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మోడీ కనుక ఈసారి టాస్క్ ఏమీ ఇవ్వకపోతే హీరోయిన్లు మాత్రం బాగా డిజప్పాయింట్ అవుతారు.