బుట్టబొమ్మ పూజాహెగ్డే కోలీవుడ్ లో విజయ్ సరసన `బీస్ట్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో యూనిట్ ప్రచారం పనుల్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా పూజాహెగ్డే ఈ సినిమా ప్రచారం పనుల్లో ఎంతో ఉత్సాహం చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. సినిమాలో ఓ ప్రమోషనల్ సాంగ్ కి సంబంధించిన ఫోటోని ఇన్ స్టాలో స్వయంగా పూజాహెగ్డే పోస్ట్ చేసింది.
ఇందులో విజయ్ -పూజాహెగ్డే- అనిరుద్ – కొరియాగ్రాఫర్ సాంగ్ షూట్ మధ్యలో ఇలా ఫోటో దిగినట్లు తెలుస్తోంది. నలుగురు రంగుల దుస్తుల్లో వెలిగిపోతున్నారు. ఈ పాట కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మించి షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పూజా హెగ్డే ఇలా `బీస్ట్` ఫోటోని పోస్ట్ చేయడం చర్చనీయాంఃగా మారింది. ఇంతకు ముందు `రాదేశ్యామ్` ప్రచారం పనుల్లో పాల్గొంది.
అప్పుడు ఏదో మొక్కుబడిగా పాల్గొన్నట్లు కనిపించింది. ప్రభాస్ పక్కనే ఉన్నా మూతి బిగించికుని కనిపించింది. హీరో-హీరోయిన్ల మధ్య సినిమాలో కెమిస్ర్టీ చూడాలి తప్ప బయట కాదంటూ ఇంటర్వ్యూయర్ ప్రశ్నకి సెటైరికల్ గా బధులిచల్చింది. ఇన్ స్టా ఖాతాలో `రాధేశ్యామ్` సినిమాకి సంబంధించి ఎలాంటి పోస్ట్ కూడా చేయలేదు.
దీంతో కొంత మంది నెటి జనులు ఆ రెండు సందర్భాల్ని గుర్తుచేస్తూ అప్పుడు లేని ఉత్సాహం పూజాహెగ్డే కి ఒక్కసారిగా ఇప్పుడెలా కట్టలు తెచ్చుకుని వచ్చేసినట్లు అంటూ కామెంట్లు చేస్తున్నారు. పైగా హీరో విజయ్ తో చేతిలో చేయి పెట్టి మరీ క్యామ్ కి ఫోజులివ్వడం..అందులోనూ నేరుగా ఆమె ఖాతాలోనే పోస్ట్ చేయడంతో డార్లింగ్ అభిమానులు ఒకింత అసహనానికి గురవుతున్న సన్నివేశం కనిపిస్తుంది.
ఇక పూజాహెగ్డే సినిమాల లైనప్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `ఆచార్య`లో నటించింది. అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉంది ఆ సినిమా. ఇక బాలీవుడ్ లో రణవీర్ సింగ్ సరసన `సిర్కస్` లో నటిస్తోంది. రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా మరో రెండు ప్రాజెక్ట్ లకు సైన్ చేసినట్లు సమాచారం.