తన సినిమాల్లో వరసగా హీరోయిన్లను రిపీట్ చేయడం కమల్ హాసన్ కు ముందు నుంచి అలవాటే. 2000 సంవత్సరం తర్వాత కూడా కమల్ కొంతమంది హీరోయిన్లకు వరసగా అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఆ క్రమంలో అలా కమల్ సరసన నటించే హీరోయిన్లతో ఆయనకు ఏదో సంబంధం ఉందనే రూమర్లూ వినిపించాయి. అలా సిమ్రాన్-కమల్ ల మధ్యన ఏదో నడుస్తోందని గతంలో గట్టిగా ప్రచారం జరిగింది.
అప్పటికే కమల్ హాసన్ తన రెండో భార్యకు కూడా విడాకులు ఇచ్చి ఉన్నారు. దాంతో కమల్ హాసన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నాడని అది మరెవరినో కాదు సిమ్రాన్ నే అని ప్రచారం జరిగింది. బ్రహ్మచారి, పంచతంత్రం వంటి సినిమాల్లో వరసగా కమల్ తో సిమ్రాన్ కలిసి నటించడంతో ఆ రూమర్లు వచ్చాయని అనుకోవాలి.
అయితే రెండో దశాబ్దాల తర్వాత కూడా అలాంటి రూమర్లే వచ్చాయి. ఈ సారి పూజాకుమార్ విషయంలో ఆ ప్రచారం. ప్రస్తుతం కూడా కమల్ సింగిల్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో పూజా సన్నిహితంగా ఉంటోందనే ప్రచారం ఉంది. ఆయనతో ఈమె వరసగా సినిమాలు చేసింది. విశ్వరూపం 1 -2, ఇంకా ఉత్తమవిలన్ వంటి సినిమాల్లో కమల్ సరసన నటించింది పూజ. అంతే కాదు కమల్ హాసన్ కుటుంబ కార్యక్రమాల్లో కూడా పూజా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కమల్ ఈమెను పెళ్లి చేసుకోంటారనే ప్రచారం ఒకటి సాగుతూ ఉంది. అయితే ఆ ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేసింది ఈ నటీమణి.
కమల్ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉన్న మాట వాస్తవమే కానీ, మిగతావన్నీ రూమర్లే అని పూజ అంటోంది. నటిగా ప్రతిభావంతురాలే ఈమె. ఈ క్రమంలో కమల్ సినిమాల్లో ఛాన్సులు సొంతం చేసుకుంది. తనకు కమల్ కూతుర్లతో కూడా సాన్నిహిత్యం ఉందని ఈమె స్పష్టం చేస్తోంది. కమల్ తో వరసగా సినిమాలు చేయడం యాధృచ్ఛికమే అని వ్యాఖ్యానించింది. అంతేగాక భవిష్యత్తులో కూడా కమల్ సినిమాల్లో తనకు అవకాశాలు రావొచ్చేమో, ఎవరు చూశారు? అంటూ.. ముందే క్లారిటీ ఇస్తోంది ఈ నటీమణి.