ప్రభాస్ బర్త్ డే స్పెషల్: బాహుబలి రీ-రిలీజ్

రెబెల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ప్రభాస్ పుట్టినరోజుకు ఆయన అభిమానులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రచ్చ మాములుగా ఉండట్లేదు. #prabhasbirthdaymonth పేరిట హ్యాష్ ట్యాగ్ ను గత 20 రోజుల నుండి ట్రెండ్ చేస్తున్నారు. అలాగే ఆరోజు వరల్డ్ వైడ్ ట్రెండ్ కు కూడా సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే యూఎస్ అభిమానులకు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ వార్త బయటకు వచ్చింది. ప్రభాస్ నటించిన ఐకానిక్ చిత్రం బాహుబలి 2ను ఈ వారం యూఎస్ లో రీరిలీజ్ చేస్తున్నారు. బాహుబలి 2 ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా యూఎస్ లో ఏ తెలుగు సినిమా అందుకోలేని రికార్డును అందుకుంది బాహుబలి 2. ఇండియన్ సినిమాలోనే హయ్యస్ట్ గ్రాస్ ను వసూలు చేసింది.

ప్రస్తుతం తెలుగు సినిమాలు ఏవీ విడుదల కావట్లేదు. పైగా ప్రభాస్ సినిమా విడుదలవ్వడానికి చాలా నెలలే పట్టే అవకాశముంది. ఇందుకోసం యూఎస్ లోని ప్రభాస్ అభిమానుల కోసం ఈ స్పెషల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరి చూడాలి బాహుబలి 2 రీరిలీజ్ లో ఎటువంటి హంగామా సృష్టిస్తుందో.