రెబెల్ స్టార్ ప్రభాస్ తో యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒక ప్రాజెక్ట్ చేద్దామని పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. అయితే పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత ప్రభాస్ ఎందుకో ఆసక్తి చూపించలేదు. అలా ఈ చిత్రానికి బ్రేక్ పడింది. ఈలోగా ప్రభాస్ వరసగా ప్యాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టేసాడు.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తోన్న బోయపాటి శ్రీను తర్వాత సినిమాను కూడా సిద్ధం చేస్తున్నాడు. ప్రభాస్ వద్దనుకున్న కథను తమిళ స్టార్ హీరో సూర్య వద్దకు తీసుకెళ్లాడు. ఈ కథకు సూర్య పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.
తెలుగులో కూడా సూర్యకు డీసెంట్ మార్కెట్ ఉంది. ఎప్పటినుండో సూర్య తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇప్పుడు బోయపాటి శ్రీను కథను అటు తెలుగు, తమిళ్ లో తెరకెక్కించనున్నారు. దిల్ రాజే ఈ సినిమాను నిర్మిస్తాడు. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయి.