ప్రభాస్‌, అల్లు అరవింద్‌, కరణ్‌ జోహార్‌ కలయిక నిజమా?

ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా హీరో. ఈయనతో ఏ సినిమా చేసినా కూడా ఖచ్చితంగా అది ఇండియా లెవల్‌లో భారీగా వసూళ్లను రాబట్టడం ఖాయం. అందుకే ఆయనతో సినిమాను తెరకెక్కించేందుకు ఎంతో మంది దర్శకులు క్యూ కడుతున్నారు. ఇదే సమయంలో ఆయనతో సినిమాలు నిర్మించేందుకు హేమా హేమీలు కూడా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్‌ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌లో చేస్తున్న ప్రభాస్‌ ఆ తర్వాత అశ్వినీదత్‌ నిర్మాణంలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు.

ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్‌ చేయబోతున్న తదుపరి చిత్రం కూడా కన్ఫర్మ్‌ అయ్యిందట. చాలా కాలంగా కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో ప్రభాస్‌ మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి. అది ప్రభాస్‌ 22వ చిత్రంతో నెరవేరబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సినిమాకు తెలుగు నిర్మాత అల్లు అర్జున్‌ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లుగా తాజాగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

భారీ బడ్జెట్‌తో ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్‌తో ప్రభాస్‌ 22వ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌, అల్లు అరవింద్‌లు కలిసి నిర్మించేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మొదటి దశ చర్చలు పూర్తి అయ్యాయట. స్టోరీ లైన్‌ రెడీగా ఉంది. ఆ స్టోరీని అద్బుతంగా మలిచే దర్శకుడి కోసం అన్వేషణ సాగుతోంది. ఆ దర్శకుడికి సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా క్రేజ్‌ ఉండాలని భావిస్తున్నారట. 2022 సంవత్సరంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇంకా చాలా సమయం ఉంది కనుక మెల్లగానే స్క్రిప్ట్‌ వర్క్‌ జరిగే ఛాన్స్‌ ఉంది.