నందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న మూవీకి మోనార్క్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూర్ణ మరియు ప్రగ్యా జైస్వాల్ లు ఎంపిక అయ్యారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. కరోనా కారణంగా మార్చిలో ఆగిపోయిన షూటింగ్ ఇప్పటి వరకు మళ్లీ పునః ప్రారంభం అవ్వలేదు. ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఈసమయంలో కథ విషయమై మరియు హీరోయిన్స్ పాత్ర విషయమై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రగ్యాజైస్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతుందట. గతంలో బోయపాటి శ్రీను తన సరైనోడు సినిమాలో కేథిన్ ను ఎలా అయితే ఎమ్మెల్యేగా అందంగా హుందాగా రొమాంటిక్ గా చూపించాడో అదే మాదిరిగా ఈ సినిమాలో కూడా ప్రగ్యా జైస్వాల్ ను అందంగా హుందాగా చూపిస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. ప్రగ్యా పర్సనాలిటీ మరియు ఫిజిక్ విషయంలో ఆమెను కొట్టే వారే ఉండరు. అలాంటి ప్రగ్యా ఐఏఎస్ లా కనిపిస్తే ఏమైనా ఉందా అంటూ అంతా కూడా ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారు.
బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఒక పాత్రలో అఘోరా కూడా బాలయ్య కనిపిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.