ఆ హీరోయిన్‌ ఫోన్‌ సెక్స్‌ చేసేదట!

‘కాఫీ విత్‌ కరన్‌’ షో ఎందుకంత క్లిక్‌ అయిందంటే, ఈ షోలో ఓపెన్‌ అయినట్టుగా సెలబ్రిటీలు ఇంకే షోలోను ఓపెన్‌ అవరు. కరణ్‌ జోహార్‌కి అందరు తారలతో ఉన్న రిలేషన్స్‌ కారణంగా ఏ ఇంటర్వ్యూయర్‌ అడగలేని పర్సనల్‌ క్వశ్చన్స్‌ అడిగేస్తుంటాడు. ఈ షోకి వచ్చిన సెలబ్రిటీస్‌ ఎలా మాట్లాడారనేది తెలిసిన వాళ్లు అతని ప్రశ్నలకి ఇబ్బంది పడరు.

పైగా మునుపటి వాళ్ల కంటే షాకింగ్‌ ఆన్సర్స్‌ ఇవ్వాలని తపిస్తుంటారు. తాజాగా కరణ్‌ షోకి వచ్చింది మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా. మామూలుగా ఇద్దరేసి సెలబ్రిటీలని పిలిచి జంట ఇంటర్వ్యూలు చేసే కరణ్‌ జోహార్‌ ఈసారి ఎందుకో ప్రియాంకని మాత్రమే పిలిచి ముచ్చట్లు పెట్టుకున్నాడు. ఈ టాక్‌ షోలో ప్రియాంక కొన్ని సంచలన నిజాలు చెప్పింది. తాను ఫోన్‌ సెక్స్‌ చేసేదాన్నని ప్రియాంక రివీల్‌ చేసింది.

ఫోన్‌ సెక్స్‌ అంటే కేవలం ఫోన్‌ సంభాషణతోనే శృంగారంలో పాల్గొనడం అన్నమాట. కుర్రకారులో పాపులర్‌ అయిన ఈరకం సెక్స్‌ తనకీ అలవాటేనని ప్రియాంక చెప్పడం సంచలనమే. అలాగే మాజీ ప్రియుడికి ముద్దు ఇచ్చిన సందర్భం ఉందని ఆమె చెప్పింది. తన పార్టనర్‌తో కలిసి స్నానం చేసిన సందర్భాలున్నాయని చెబుతూనే ఈ షో తన తల్లి చూడకూడదని కోరుకుంటున్నానని అంది.

ఈ ఇంటర్వ్యూ వల్ల కరణ్‌ గురించి కూడా ఒక నిజం తెలిసింది. ఒకసారి ప్రియాంకని వెనుకనుంచి తడిమాడట. అప్పుడామె అతడి మూతి పగలగొట్టినంత పని చేసిందట. ఇలాంటి టాక్‌ షోలు చూస్తే తెలుగు సినిమా వాళ్లు ఇంత ఓపెన్‌ కాదెందుకో అనిపించదూ?