ఇప్పుడు ఇండియాలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ హోదా ఆమెదే. బాలీవుడ్‌లోనూ మంచి మంచి అవకాశాలే వస్తున్నాయి. అక్కడ ఇంతకుముందు చేసిన సినిమాలు అంత మంచి ఫలితాలివ్వకున్నా.. పూజాకు అవకాశాలేమీ తగ్గిపోలేదు. సల్మాన్ ఖాన్ సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని కూడా అందుకుంది.
ఐతే బాలీవుడ్ హీరోయిన్ అన్నాక ఏదో ఒక దశలో ఎఫైర్ల గురించి పుకార్లు రావడం సహజం. ఇన్ని రోజులు పూజా గురించి అలాంటి వార్తలేమీ రాలేదు కానీ.. ఇప్పుడు ఆమె కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది. బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ మెహ్రా కొడుకు రోహన్ మెహ్రాతో పూజ ప్రేమలో పడిందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తల గురించి పూజ స్పందించింది. అవి అవాస్తవాలని స్పష్టం చేసింది. “ప్రస్తుతం నేను ఎవరితోనూ ప్రేమలో లేను. రోహన్ నాకు మంచి మిత్రుడు. అంతే.. అంతకు మించి మా మధ్యం ఇంకేం లేదు“ అని పూజ క్లారిటీ ఇచ్చింది. ఇక పూజ టాలీవుడ్ కెరీర్ విషయానికొస్తే ప్రభాస్ సరసన ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న ఆమె.. అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోనూ కథానాయికగా చేస్తోంది. మహేష్ బాబు, ఎన్టీఆర్లతోనూ ఆమె మళ్లీ జోడీ కట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.