పున్నును న్యూడ్‌ ఫొటో అడిగిన నెటిజన్‌.. ఆమె రియాక్షన్ ఏంటో తెలుసా.?

బిగ్ బాస్‌ తో మంచి ఫేమ్‌ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ పునర్నవి భూపాలం ప్రస్తుతం వెబ్‌ సిరీస్ లతో పాటు సినిమాల్లో కూడా బిజీ బిజీగా నటిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. సమయం చిక్కిన ప్రతి సారి అభిమానులతో చిట్ చాట్‌ చేస్తూనే ఉంటుంది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు వారు అడిగిన ఫన్నీ ఫొటో ఫోజ్‌లు ఇస్తూ వారి కోరిక తీర్చుతూ ఉంటుంది. ఇటీవల ఒక లైవ్‌ చాట్‌ లో పున్నుకు అనూహ్యంగా ఒక ప్రశ్న ఎదురైంది.

ఆ ప్రశ్న ఏంటీ అంటే మీరు న్యూడ్‌ గా ఎలా ఉంటారు ఒకసారి ఫొటో షేర్‌ చేయండి అంటూ అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా పున్ను సింపుల్‌ గా సీరియస్ గా తన వేలిని చూపించింది. ఆ సమాధానం అతడు ఊహించి ఉండడు. సాదారణంగా అయితే సెలబ్రెటీలు ఇలాంటి ప్రశ్నలను స్కిప్‌ చేస్తూ ఉంటారు. కాని పున్ను మాత్రం షాకింగ్ గా తన మద్య వేలు చూపించి మరింతగా అతడికి బూతుగా సమాధానం ఇచ్చింది. పున్ను ఘట్స్‌ కు హ్యాట్సాఫ్‌ కొందరు చెబుతూ ఉంటే మరి కొందరు ఆమెను అభినందిస్తున్నారు.