వెర్టికల్ ఫార్మింగ్ కాన్సెప్ట్ తో అదరగొట్టిన పూరి

ఈ లాక్ డౌన్ సమయంలో చాలా తక్కువగా మనం పాజిటివ్ న్యూస్ లు వింటున్నాం. అందులో పూరి జగన్నాథ్ మ్యుసింగ్స్ ఒకటి. పోడ్ కాస్ట్ ల ద్వారా పూరి జగన్నాథ్ వివిధ విషయాలపై స్పందిస్తున్నారు. కొన్ని విషయాల మనకు తెలిసినవే అయినా అందులో కొత్త కోణాన్ని పరిచయం చేసాడు పూరి. అలాగే కొన్ని మనకు పెద్దగా తెలియని కాన్సెప్ట్ లను కూడా పరిచయం చేస్తున్నాడు. అలాగే రీసెంట్ గా పూరి లేవనెత్తిన వెర్టికల్ ఫార్మింగ్ పోడ్ కాస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

అసలు వెర్టికల్ ఫార్మింగ్ అంటే ఏంటి? అందులో ఎన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని అవలంబించే తీరుని చాలా చక్కగా వివరించాడు పూరి. మట్టి లేకుండా హైడ్రోపోనిక్స్ పద్దతిలో వ్యవసాయం చేయడం వంటివి వివరించాడు. ఈ వెర్టికల్ ఫార్మింగ్ మనకు ఎందుకు అంత అవసరం అన్నది కూడా తెలిపాడు.

ఈ పోడ్ కాస్ట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకు ట్యాగ్ చేసి పోస్ట్ చేసాడు పూరి.

ఇలా పూరి తన జ్ఞానాన్ని ఇలా పోడ్ కాస్ట్స్ ద్వారా మనకు అందించడం నిజంగా సూపర్ కదా.