‘చిరుత’ కాంబో రిపీట్‌ అవ్వబోతుందా?

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ తో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిన విషయం తెల్సిందే. పూరి ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ఫైటర్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ వచ్చే సమ్మర్‌ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. పూరి తదుపరి సినిమా విషయమై క్లారిటీ రాలేదు. యశ్‌ హీరోగా ఈయన ఒక సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో పూరికి మెగా ఫ్యామిలీ నుండి పిలుపు వచ్చిందనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో గుప్పుమంటుంది.

రామ్‌ చరణ్‌ ను చిరుత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరి జగన్నాద్‌ అనే విషయం తెల్సిందే. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరి కాంబో సినిమా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఈలాక్‌ డౌన్‌ లో పూరి పలు కథలను సిద్దం చేశాడు. అందులో ఒకటి చరణ్‌ కు బాగా నచ్చడంతో పూరి దర్శకత్వంలో నటించాలని భావించాడట. ఈ విషయంలో ఇంకా ఎలాంటి చర్చలు అయితే జరగలేదు. కాని త్వరలోనే పూరి స్వయంగా చరణ్‌ మరియు చిరులను కలిసి కథ చెప్పే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

చరణ్‌ ఇప్పటి వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత చేయబోతున్న సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. చాలా కథలు విన్న చరణ్‌ ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఓకే చెప్పలేదు. దాంతో పూరితో సినిమా దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ మరియు పూరి ఫైటర్‌ సినిమాలు పూర్తి అయిన తర్వాత కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటూ మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.