అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన పుష్ప చిత్రం గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా 350 కోట్ల వసూళ్లను దక్కించుకున్న పుష్ప సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే పుష్ప పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం అవ్వాల్సి ఉంది. మార్చి చివర్లో లేదా ఏప్రిల్లో పుష్ప 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవ్వాల్సి ఉంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ మొదటి వారం వరకు ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ ఆలస్యానికి కారణం ఏంటి అనే విషయంలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ విషయం లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు అల్లు అర్జున్ లుక్ పరంగా కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ ఆలస్యం కారణంగా ఈ ఏడాది డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన పుష్ప 2 విడుదల అయ్యేనా అంటూ కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు పుష్ప సినిమా ను అడ్డుకుంటుంది ఎవరు అనేది క్లారిటీ రావడం లేదు.