ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ఇంగ్లీష్ మీడియంపై ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఆర్ నారాయణ మూర్తి సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించాడు. విప్లవ సినిమాలను తెరకెక్కించడంతో పాటు నటించే ఆర్ నారాయణ మూర్తి ఈమద్య కాలంలో కాస్త సినిమాల సంఖ్యను తగ్గించాడు. ఇటీవల వరుసగా జగన్ ప్రభుత్వాలపై ప్రశంసలు కురిపిస్తున్న ఆర్ నారాయణ మూర్తి తాజాగా ఇంగ్లీష్ మీడియంపై సినిమాను తీసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించాడు.
నారాయణమూర్తి మాట్లాడుతూ.. తన సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం కరోనా అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ సినిమాను ప్రారంభించాలని అనుకున్నా కూడా కరోనా వల్ల ఆలస్యం చేస్తున్నామన్నారు. ఇంగ్లీష్ మీడియం యొక్క ప్రాముఖ్యత.. యూనివర్శిటీల్లో ఊర్లో చదువుకున్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది తాను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా ఎర్రన్న చెప్పుకొచ్చాడు. జగన్ ఇంగ్లీష్ మీడియంను తీసుకు రావడం అభినందనీయం అంటూ నారాయణమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు.