సినిమా అనేది థియేటర్ల ద్వారా విడుదల అయితేనే అంతా చూస్తారని.. ఓటీటీ ల ద్వారా సినిమాను చూడాలంటే అందరికి అందుబాటులో ఉండదు అంటూ పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఓటీటీలు ప్రస్తుతంకు 25 శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. మిగిలిన 75 శాతం మంది మద్యతరగతి, దిగువ తరగతుల వారికి ఓటీటీ ల గురించి తెలియదు.. తెలిసినా వాటిని తీసుకునేంత స్థోమత లేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. నారప్ప నేను చూడాలంటే నా వద్ద ఓటీటీ లేదన్నాడు.
ఓటీటీ లో సినిమా విడుదల చేస్తే అందరికి చేరువ అవ్వదు అన్నాడు. థియేటర్ల ద్వారా సినిమాలు వస్తేనే స్టార్స్ అవుతారని.. డబ్బుకు ఆశ పడి థియేటర్ల వ్యవస్థను నాశనం చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. సురేష్ బాబు నిర్మాతల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా అంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందింస్తూ నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గించేలా ప్రయత్నాలు చేయాలి తప్ప ఇలా ఓటీటీలకు వెళ్ల వద్దని.. సినిమా అనేది మనం థియేటర్లలో చూస్తూ ఎంజాయ్ చేయాలి తప్ప.. ఇంట్లో కూర్చుని చూస్తే ఫీల్ రాదన్నాడు. కరోనా కష్టకాలంలో థియేటర్ల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూల దృక్పదంతో వ్యవహరించాలని కూడా పీపుల్స్ స్టార్ కోరారు.