రాశి ఖన్నా మొత్తానికి స్పందించింది. తనపై వస్తోన్న రూమర్లకు ఒక్క ట్వీట్ తో చెక్ పెట్టింది. గత కొన్ని రోజులుగా రాశి ఖన్నా తెలుగు చిత్రాలను కించపరిచిందని, ఇక్కడ సినిమాలు చేసి, ఇక్కడి చిత్రాలను తక్కువ చేసి మాట్లాడిందని వార్తలు వచ్చాయి. సౌత్ లో కేవలం హీరోయిన్లను గ్లామర్ డాల్స్ గానే పరిగణిస్తారని వ్యాఖ్యానించినట్లు చెప్పారు.
అయితే రాశి ఖన్నా రూమర్స్ క్లియర్ చేసింది. తాను చేసిన ప్రతీ చిత్రం పట్ల తనకు గౌరవం ఉందని, ఇటువంటి అర్థరహితమైన వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది. నేను సౌత్ చిత్రాలను కించపరచలేదు అని రాశి ఖన్నా పోస్ట్ చేసింది.
తెలుగులో పక్కా కమర్షియల్ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తోంది రాశి. ఇటీవలే హిందీలో రుద్ర అనే వెబ్ సిరీస్ చేసింది. తమిళంలో కార్తీ సరసన సర్దార్, హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మరో సినిమా చేస్తోంది రాశి.