పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని అంటారు! టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన వరుసగా సినిమాలు చేసిన రాధికా ఆప్టే టాలీవుడ్ కి కల్చర్ లేదంటూ సెన్సేషనల్ ఆరోపణలు చేశారు. పెద్ద హీరోలు వచ్చే వరకూ గంటల కొద్దీ సమయం వేచి చూడాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యల ప్రభావం తన కెరీర్ పైనా పడింది. ఇటీవల అవకాశాల్లేవ్.
కానీ గతం గతః అంటూ ఇప్పుడు మళ్లీ తెలుగు హీరోలపై మనసు పారేసుకుంటున్న రాధికా ఆప్టే తిరిగి ప్రయత్నాలు ప్రారంభించారట. విలన్ రోల్స్ ఉంటే చూడమని లోకల్ కాస్టింగ్ ఏజెంట్స్ కి ప్రపోజల్ పంపారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో ఇక్కడ ఫేవరిజం గురించి కామెంట్లు చేసి టాలీవుడ్ లో సినిమా వాళ్లకి ప్రొఫెషనలిజం లేదని కామెంట్స్ చేసిన రాధికా ఆప్టే ఆ తరువాత తెలుగు వైపు చూడనే లేదు. ఇప్పుడు మళ్లీ అదే పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేయడం ఆశ్చర్యం కలిగించేదే. ఒకవేళ రాధిక ట్రై చేసినా మన స్టార్ హీరోలు తిరిగి అవకాశాలిస్తారా? అన్నదే ఇప్పుడు అసలు పాయింట్. మరోవైపు అటు బాలీవుడ్ లో రాధికకు అవకాశాల్లేకపోవడమే ఈ డ్యూయల్ మైండ్ సెట్ కి కారణమని విశ్లేషిస్తున్నారు.