ఎక్స్ క్లూజివ్: రఘు కుంచె కూతురి వివాహానికి హాజరు కానున్న మెగాస్టార్

సింగర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు సంగీత దర్శకుడిగా తన హవా చాటుకుంటున్నాడు రఘు కుంచె. ప్రతీ ఆల్బమ్ లోనూ తనదైన శైలిలో ఫోక్ సాంగ్ ను పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టడం రఘు శైలి. రీసెంట్ గా పలాస సినిమాలో రఘు కుంచె కంపోజ్ చేసిన నాది నక్కిలీసు గొలుసు ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరం చూసాం.

తాజా సమాచారం ప్రకారం రఘు కుంచె కూతురు వివాహం ఈరోజు రాత్రి 9.50 నిమిషాలకు ఒక స్టార్ హోటల్ లో జరగనుంది. అయితే ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ పెళ్లి వేడుకకు ఎక్కువ హంగామా చేయట్లేదు.

అయితే ఈ పెళ్ళికి స్టార్ సెలబ్రిటీల సందడి మాత్రం బానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కొంత మంది ప్రముఖ సెలబ్రిటీలు విచ్చేయనున్నారు.

రఘు కుంచె కూతురి పేరు రాగ పుష్యమి, ఆశిష్ వర్మతో ఆమె వివాహం జరుగుతోంది.