బిగ్‌బాస్ నాల్గో సీజన్లో టాప్ 5 గురించే చర్చ నడుస్తోంది. ఈ వారంలో ఎవరు ఫైనల్‌కు వెళ్లే అవకాశానికి దూరం కానున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు కంటెస్టెంట్ల బలాబలాను చూపించిన బిగ్‌బాస్ ఈ వారం మాత్రం వారిని అన్ని రకాలుగా పరీక్షించాడు. ఇంటిసభ్యుల ఓపికకు పరీక్ష పెడుతూనే ఏకాగ్రతను అంచనా వేశాడు. వారిలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్‌ను కూడా ‘అధికారం’ టాస్కు ద్వారా బయటపడేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ టాస్కుల్లో ఎన్నడూ లేనంత రచ్చ చోటు చేసుకుంది. ఇంకో వారంలో షో ముగిసే సమయంలో పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. మోనాల్, అరియానా మధ్య మొదలైన ఈ గొడవ అరియానా, సోహైల్ దగ్గర అగ్గి రాజుకుంది.
అగ్రిమెంట్ రాసుకున్నానా?
వీళ్ల లొల్లితో అగ్నిగుండంలా మార్చిన హౌస్‌ను చల్లార్చడం కేవలం నాగార్జున వల్లే అవుతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే గత సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఈ టామ్ అండ్ జెర్రీలను సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట అభిజిత్‌కు మద్దతు తెలిపినప్పటికీ తర్వాత అరియానా, సోహైల్‌కు ఓటేయమండంటూ యూటర్న్ తీసుకోవడంతో అభి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేశారు. దీంతో మండిపడ్డ రాహుల్ ఒక్కరికే సపోర్ట్ చేస్తానని అగ్రిమెంట్ రాసుకున్నానా? అని విరుచుకుపడ్డాడు. అభి ఎలాగో సేవ్ అవుతాడు కాబట్టే మిగతావాళ్లకు సపోర్ట్ చేస్తున్నా అని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వారం జరిగిన గొడవతో రాహుల్ మళ్లీ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరికి బదులుగా సోహైల్‌కు ఒక్కడికే సపోర్ట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు కూడా పెట్టాడు.
కారణం లేకుండా కోపం రాదు
“బిగ్‌బాస్ హౌస్‌లో సోహైల్ నిజమైన ఎంటరైనర్. ముక్కసూటిగా మాట్లాడతాడు, శక్తిమేర కష్టపడతాడు, పాజిటివ్‌గా ఆలోచిస్తాడు, ముఖ్యంగా తన స్నేహితులను ఎప్పుడూ ఎంకరేజ్చేస్తుంటాడు. హౌస్‌లో ఎవరైనా బాధపడుతుంటే చూడలేడు, వాళ్లను సముదాయించేందుకు ప్రయత్నిస్తాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించేందుకు ఎప్పుడూ ముందుంటాడు. అతడికి షార్ట్ టెంపర్ ఉంది. కానీ ఏ కారణం లేకుండా ఊరికే కోపం రాదు, అలా అని వచ్చిన కోపాన్ని కప్పి పుచ్చేందుకు ప్రయత్నించడు. ఎలాంటి ముసుగు ధరించకుండా నిజాయితీగా ఉంటాడు. మనందరిలో ఒకడిగా మెదులుతాడు” అని సోహైల్ గురించి చెప్పుకొచ్చాడు. ఇది కేవలం తన అభిప్రాయమని పేర్కొన్నాడు. షో ముగింపుకు ఇంకా కొన్ని రోజులే ఉన్నందున బాగా ఆలోచించి మీకు బెస్ట్ అనిపించిన కంటెస్టెంట్‌కే ఓటేయండని బిగ్‌బాస్ ప్రేమికులకు విజ్ఞప్తి చేశాడు.