RRR అంతకంటే పెద్దది కాదని రాజమౌళికి తెలుసు

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత అంతకుమించి అనేలా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసినట్లు అందరూ చెప్పుకుంటారు. అయితే RRR సినిమా బాహుబలి కంటే పెద్దది కాదు అని రాజమౌళి కి ముందే తెలుసు అని ఆయనతో సన్నిహితంగా ఉండే ఒక టెక్నీషియన్ తెలియజేశాడు. ఎందుకు అనే వివరాల్లోకి వెళితే రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా కథకు తగ్గట్టుగానే చాలా గ్రాండ్ గానే సినిమాను తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తాడు.

అంతేకాకుండా అందులో ఎమోషన్స్ కూడా హైలెట్ గా ఉండాలి అనుకుంటాడు. ఇక RRR సినిమా విషయంలో రాజమౌళి గ్రాండియర్ కంటే కూడా ఎక్కువగా ఎమోషన్స్ తో స్టోరీ డ్రామా పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు అర్థమయింది. అదే విషయాన్ని ఆయనతో ఎల్లప్పుడు సన్నిహితంగా ఉండే సాబు సిరిల్ తెలియజేశారు. ఇండియాలోనే మెచ్చుకోదగిన నెంబర్ వన్ ఆర్ట్ డైరెక్టర్లలో సాబు సిరిల్ ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆయన రాజమౌళి ప్రతి సినిమాకు కూడా వర్క్ చేయడం జరుగుతుంది. స్క్రిప్టు దశలో నుంచే రాజమౌళి తో చర్చలు జరుపుతూ సినిమా షూటింగ్ చివరి వరకు కూడా కలిసి ట్రావెల్ అవుతూ ఉంటారు. అయితే సాబు సిరిల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో RRR సినిమా గురించి ఎవరూ ఊహించని విధంగా ఒక విషయాన్ని చెప్పారు. రాజమౌళికి RRR సినిమా బాహుబలి కంటే పెద్దది కాదు అని షూటింగ్ మొదలు పెట్టినప్పుడే తెలుసు అని చెప్పారు.

ఇద్దరు హీరోలతో సినిమా చేస్తున్నప్పటికీ కూడా సినిమా కథకు తగ్గట్టుగా వెళ్ళడమే ఉత్తమమని గ్రాండియర్ కంటే కూడా కథలో ఎమోషన్స్ తో పాటు స్టోరీ డ్రామా పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా సాబు సిరిల్ తెలియజేశారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద కూడా బాహుబలి సినిమా కలెక్షన్స్ ను బీట్ చేయలేకపోయింది. తెలుగులో అత్యధిక వసూళ్లను అందుకున్నప్పటికీ కూడా ఇండియాలో అలాగే విదేశాల్లో బాహుబలి రికార్డులను బ్రేక్ చేయలేకపోయింది.