ఇద్దరు సూపర్‌ స్టార్‌ల బాక్సాఫీస్ వార్‌

తమిళ సూపర్‌ స్టార్‌ అంటే ఒకప్పుడు రజినీకాంత్ మాత్రమే గుర్తుకు వచ్చేవాడు. కాని ఇప్పుడు తమిళ సూపర్‌ స్టార్‌ అంటూ విజయ్ కూడా కీర్తింపబడుతున్నాడు. గత కొంత కాలంగా రజినీకాంత్ ను మించిన విజయాలను విజయ్ దక్కించుకుంటున్నాడు అనడంలో సందేహం లేదు. విజయ్ సినిమా యావరేజ్ టాక్ దక్కించుకున్నా ఈజీగా 200 కోట్ల వసూళ్లు నమోదు అవుతూ ఉంటాయి. సౌత్ హీరో అయినా కూడా పాన్ ఇండియా స్టార్‌ డం ఉంది. ఇక రజినీకాంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు ఈ దీపావళికి పోటీ పడబోతున్నారు.

రజినీకాంత్‌ నటిస్తున్న అన్నాత్తే సినిమా ను దీపావళి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శివ దర్శకత్వంలో భారీ స్టార్‌ కాస్టింగ్ తో రూపొందుతున్న అన్నాత్తే సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదే సమయంలో విజయ్‌ నటిస్తున్న 65వ సినిమా కూడా దీపావళికి విడుదల కాబోతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ఈ రెండు సినిమాలు కూడా దీపావళి కానుకగా ఒకటి రెండు రోజుల గ్యాప్ లో లేదంటే ఒకే రోజులో విడుదల కాబోతున్నాయి. దాంతో సినిమాలు ఖచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడటం ఖాయం అంటున్నారు.