స్పెషల్ అనుమతులతో రజినీ సినిమా నైట్ షూటింగ్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అన్నాత్తై చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెల్సిందే. అయితే ప్రస్తుతం తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ విధించడం కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని బలంగా తాకింది. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.

కరోనా తాకిడి తట్టుకోవడానికి ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. అయితే సినిమా షూటింగ్స్ మధ్యలో ఉన్న వాటికి ప్రత్యేక అనుమతులను ఇస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న అన్నాతై చిత్ర షూటింగ్ కోసం కూడా ప్రత్యేక అనుమతులు తీసుకున్నారు.

ఈ సినిమా నైట్ షూటింగ్ జరుపుకుంటోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో గత కొన్ని రోజులుగా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న విషయం తెల్సిందే.