కోలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఏ స్టార్ ని రదిపినా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట స్టార్ హీరో ధనుష్ – ఐశ్వర్య విడాకుల టాపిక్. ఇటీవల వీరిద్దరూ విడిపోతున్నామంటూ సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దక్షిణాదిలో వీరి విడాకుల అంశం సంచలనంగా మారింది. వీరు విడిపోవడానికి ఇద్ద మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న గొడవలే కారణమని తెలుస్తోంది. ఈ విషయాన్ని ధనుష్ తండ్రి కాస్తూరి రాజా చెన్నైలో ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.
అంతే కాకుండా వీరిద్దరు మళ్లీ కలుస్తారని భార్యా భర్తలన్నాక గొడవలు సహజమని అలాంటి గొడవల కారణంగానే విడిపోతున్నామంటూ ప్రకటించారని ఈ ప్రకటనకు ముందు రజనీకాంత్ కూడా ఇద్దరితో ఫోన్ లో మాట్లాడి తమ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారని స్పష్టం చేశారు. మరో పక్క ధనుష్ – ఐశ్వర్యల విడాకుల విషయం తెలిసిన చాలా మంది సెలబ్రిటీలు తమ నిర్ణాయన్ని పునరాలోచించాలని వారికి చెబుతున్నారట.
ఇదిలా వుంటే.. ధనుష్ పై రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించిన ఓ పాత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. రజనీకాంత్ నటించిన `కాలా` చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజ్ పైకొచ్చిన రజనీ తన అల్లుడు బంగారం అని ప్రశంశించారు. `ధనుష్ అద్భుతమైన అబ్బాయి. తన తల్లిదండ్రులని గౌరవిస్తాడు. వారిని దేవుళ్లలా భావిస్తాడు. భార్యను బాగా చూసుకుంటాడు. మంచి తండ్రి మంచి అల్లుడు మంచి మనిషి మంచి ప్రతిభగలవాడు` అని పొగడ్తల వర్షం కురిపించారు.
ఆ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ధనుష్ – ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన వేళ రజనీ `ధనుష్ మంచి వాడంటూ ప్రశంసలు కురిపించిన వీడియో వైరల్ గా మారడం పలువురిని ఆకట్టుకుంటోంది. విడాకుల విషయంలో ధనుష్ ది ఎలాంటి తప్పులేదని చెప్పడం కోసమే ధనుష్ అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.