ఆసుపత్రిలో జాయిన్‌ అయిన సూపర్‌ స్టార్‌

రెండు మూడు రోజులుగా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఆరోగ్యం విషయంలో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన ఆరోగ్యం సరిగా లేదు అంటూ వస్తున్న వార్తలకు ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. రజినీకాంత్‌ జ్వరంతో బాధపడుతున్నారని.. అందుకే ఆయన్ను చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో జాయిన్‌ చేశారని, కరోనా పరీక్ష నిర్వహించగా అందులో నెగటివ్‌ వచ్చినట్లుగా తమిళ సినీ వర్గాల వారు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా రజినీకాంత్‌ ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కరోనా భయంతో గత కొన్నాళ్లుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన రజినీకాంత్‌ పార్టీ విషయమై కూడా వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇలాంటి సమయంలో రజినీకాంత్‌ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అభిమానులు ఏం జరుగుతుంది అంటూ ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైధ్యులు పేర్కొన్నారు. త్వరగా రజినీకాంత్‌ ఆరోగ్యం కుదుట పడాలంటూ అభిమానులు పూజలు చేస్తున్నారు. అన్నాత్తే సినిమా లో రజినీకాంత్‌ నటిస్తున్నాడు. మరో వైపు రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై చర్చలు జరుపుతున్నాడు. ఈ సమయంలో జ్వరం అందరిని కంగారు పెట్టిస్తుంది.