‘రెచ్చిపోదాం బ్రదర్’ అంటోన్న రాజీవ్ కనకాల

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజీవ్ కనకాల ఎప్పుడూ బుల్లితెరకు ప్రాధాన్యత ఇస్తూనే వచ్చాడు. అప్పట్లో టివి వ్యాఖ్యాతగా ఎన్నో సూపర్ హిట్ షోస్ ను విజయవంతంగా నిర్వహించాడు రాజీవ్ కనకాల. అయితే రాజీవ్ కనకాల షోస్ మానేసి చాలా కాలమే అయింది. అడపాదడపా సినిమాల్లో నటిస్తోన్న రాజీవ్, సుమ యాంకర్ గా చేస్తోన్న షోస్ కు కూడా గెస్ట్ గా పలు మార్లు వచ్చాడు. క్యాష్, స్టార్ మహిళ, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ వంటి షోస్ కు గెస్ట్ గా విచ్చేసిన రాజీవ్ ఇప్పుడు మరో సారి షో ను హోస్ట్ చేయబోతున్నాడు.

అవును రాజీవ్ కనకాల చేస్తోన్న ఈ షో కు రెచ్చిపోదాం బ్రదర్ అనే క్యాచీ టైటిల్ ను పెట్టారు. “నవ్వించడానికి వంద దారులున్నాయి. అయితే ఆ వంద దారులు ఒకే చోటుకు వస్తే” అంటూ రాజీవ్ కనకాల అంటే జంక్షన్ జామ్ అయిపోద్ది అని మరో వాయిస్ రావడంతో ఈ షో కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.