ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే పెద్ద జోకర్ మాదిరిగా రాకేష్ మాస్టర్ కనిపిస్తున్నాడు. యూట్యూబ్ లో బూతు మాటలతు సోషల్ మీడియాలో బూతుల మీమ్స్ ఇలా ఎక్కడ చూసినా కూడా రాకేష్ మాస్టర్ కనిపిస్తున్నాడు. ఆయన ఈయన ఆమె ఈమె అనే తేడా లేకుండా నోటికి వచ్చినట్లుగా ఇష్టానుసారంగా విమర్శలు చేయడం బూతులు మాట్లాడటం వంటివి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరి కొందరు మాత్రం విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఒక యూట్యూబ్ వీడియోలో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ హీరోయిన్ మాధవి లత గురించి మాట్లాడాడు. ఆ వ్యాఖ్యలపై మాధవిలత సీరియస్ అయ్యింది. తన పరువు తీసే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ రాకేష్ మాస్టర్ కు లీగల్ నోటీసులను మాధవిలత పంపించింది. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. రాకేష్ మాస్టర్ దీని గురించి ఎలా స్పందిస్తాడో చూడాలి.