భారీ నష్టాల్లో రకుల్‌ ప్రీత్‌ వ్యాపారం

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈమద్య కాలంలో ఆఫర్లే లేక నానా అవస్థలు పడుతోంది. మళ్లీ ఏదో ఒక మంచి ఛాన్స్‌ వస్తే రెండు మూడేళ్ల వరకు వరుసగా సినిమాలు చేయవచ్చని భావిస్తున్న రకుల్‌ కు ఆఫర్లే కరువయ్యాయి. ఇలాంటి సమయంలో ఆమెకు వ్యాపారంలోనూ తీవ్రమైన నష్టాలు వచ్చాయి. మొన్నటి వరకు ఆమె జిమ్‌ సెంటర్‌ బిజినెస్‌ మూడు కాయలు ఆరు పూలు అన్నట్లుగా సాగాయి. తన బ్రాండ్‌ ఇమేజ్‌తో మూడు జిమ్‌ సెంటర్‌లను ఓపెన్‌ చేసిన ఈ అమ్మడు నెలకు లక్షల్లో సంపాదించింది.

ఇప్పుడు ఆమె పరిస్థితి మాత్రం రివర్స్‌గా ఉంది. ఆదాయం రాని జిమ్‌ సెంటర్‌లకు ఇప్పటి వరకు వచ్చిన ఆదాయంను పెట్టాల్సి వస్తుంది. గత రెండు నెలలుగా జిమ్‌ సెంటర్‌ు ఓపెన్‌ చేయడం లేదు. దాంతో ఆమె చేతి నుండి అందులో చేసే ట్రైనర్స్‌ మరియు ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించాల్సి వస్తుంది. అలాగే లక్షల రూపాయల అద్దెలను కూడా ఆమె చెల్లించాల్సి వస్తుందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జిమ్‌ సెంటర్‌ లను ఇప్పట్లో ఓపెన్‌ చేసే అవకాశం లేదు.

కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు జిమ్‌ సెంటర్‌లతో పాటు మరికొన్ని సమూహాలకు సంబంధించిన వ్యాపాలను మూసేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాల వారు చెబుతున్నారు. అందుకే కనీసం ఆరు నెలలు అయినా జిమ్‌ సెంటర్‌లు మూసే ఉంటాయి. కనుక ఆ ఆరు నెలలు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన సొంత డబ్బులను సిబ్బందికి చెల్లించి వారిని కాపాడుకోవాల్సి ఉంటుంది. అలాగే అద్దె చెల్లించి జిమ్‌ సెంటర్‌లను కంటిన్యూ చేయాలి. అలా చేయాలంటే నెలకు రెండున్నర నుండి మూడు లక్షల చొప్పున ఆమె ఖర్చు చేయాల్సి వస్తుందట. అంటే దాదాపుగా 20 లక్షల వరకు ఆమె చేతి నుండి పెట్టాలంటున్నారు. సినిమాల ఆఫర్లు లేని ఈ సమయంలో ఇంత మొత్తం పెట్టడం అంటే కష్టమే అంటూ ఆమె బాబోయ్‌ అంటుందట.