ఫోటో స్టోరి: ‘స్వాతి ముత్యం’ కి కజిన్ లా ఉంది

ఫోటోగ్రఫీ జిమ్మిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి వారిని అయినా ఆకృతి పరంగా సంపూర్ణంగా మార్చేసే సామర్థ్యం ఈ కళకు ఉంది. ఇప్పుడు అలాంటి మ్యాజిక్ రకుల్ పై వర్కవుటైంది. సరికొత్త మ్యాజికల్ లుక్ తో తళుక్కుమంది రకుల్ ప్రీత్. చూడగానే ట్వంటీ మైనస్ బ్యూటీలా కనిపిస్తోంది.

స్కూల్ డేస్ క్యాటీలా.. ఎంతో ఫన్నీగా కూడా ఉంది ఈ లుక్. రెండు పిలకలు ముడివేసి.. టైట్ గా దువ్వేసిన పాపిడితో.. పసుపు రంగు గ్లాసెస్ తో కాంబినేషన్ అదరగొట్టింది. బ్లూ స్వెట్ షర్ట్ దానికి కాంబినేషన్ ఫ్రాకుతో రకుల్ ఎంతో స్పెషల్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ యూత్ లో డిబేటబుల్ గా మారింది.

ప్రఖ్యాత ‘హలో’ మ్యాగజైన్ కవర్ పేజీపై ఇలా మెరిసింది రకుల్. రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేకమైన లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. రకుల్ బ్లూ కలర్ టాప్ తో పాటు ఫంకీ ప్రింటెడ్ ప్యాంట్ ను ధరించింది. మ్యాగజైన్ కవర్ పై ప్రత్యేకంగా కనిపిస్తోంది.

తన హెయిర్ స్టైల్ పరంగా ప్రయోగం ఆకర్షిస్తోంది. వైవిధ్యమైన రూపంతో ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది. రకుల్ యూనిక్ లుక్ తో ప్రయోగాత్మక ఫ్యాషన్ తో ఆకట్టుకుంటోంది. రకుల్ ఇంతకుముందు గ్రాజియా- ఎల్లే- ఎగ్జిబిట్- మాగ్జిమ్ లాంటి అనేక మ్యాగజైన్ కవర్ లపై తళుకుబెళుకులు ప్రదర్శించింది.

వాటన్నిటి కంటే హలో కవర్ లుక్ అదిరిందన్న ప్రశంసలు అందుకుంటోంది. కొందరైతే’స్వాతి ముత్యం’కి కజిన్ లా ఉంది.. హేయ్ రకుల్ ఏంటీ వెరైటీ! అంటూ తమ ఫీలింగ్ ని బయటికి చెబుతున్నారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. రకుల్ తదుపరి డాక్టర్ జి- రన్వే 34- అయాలాన్ ఇండియన్ 2 సహా మరికొన్ని చిత్రాల్లో కనిపించనుంది. భారతీయుడు 2 కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం తనని చిక్కుల్లో వేసింది. అయినా ఇతర కమిట్మెంట్ల విషయంలో జోరు మీదుంది.