వారంతా కూడా రకుల్‌ కు క్షమాపణ చెప్పాలి

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ కు డ్రగ్స్‌ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉంది అంటూ కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురితం చేశాయి. ఆమె ను విచారణకు ఎన్‌ సీ బీ అధికారులు పిలవడంతో కొన్ని మీడియా సంస్థలు ఏకంగా ఆమె కు డ్రగ్స్‌ అలవాటు ఉందని కూడా ప్రచారం చేశాయి. దాంతో ఆమె తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది. మీడియా తనపై చేసిన వ్యాఖ్యలను మౌనంగా భరించింది. తనపై మీడియా చేసిన కథనాలపై న్యాయస్థానంను ఆశ్రయించింది. ఆ కేసును న్యూస్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ స్టాండర్స్‌ అథారిటీకి కోర్టు బదిలీ చేయడం జరిగింది.

విచారణ జరిపిన బ్రాడ్‌ కాస్టింగ్‌ అథారిటీ వారు రకుల్‌ గురించి జీన్యూస్‌, జీ 24 టాస్‌, జీ హిందుస్థాన్‌, టైమ్స్‌ నౌ, ఇండియా టుడే, ఆజ్‌ తక్‌, న్యూస్‌ నేషన్‌ వంటి మీడియా సంస్థల కథనాలను తప్పుబట్టాయి. నిజా నిజాలు తెలుసుకోకుండా కథనాలు రాయడం ద్వారా మీడియాపై ఉన్న నమ్మకం పోతుందని, మీరు చేసిన పని వల్ల ఇతర మీడియా సంస్థలు సైతం నమ్మకంను కోల్పోయే ప్రమాదం ఉందని అందుకే మీరు ఆమెకు క్షమాపణ చెప్పాలంటూ ఆదేశించింది. వారం రోజుల్లో క్షమాపణ చెప్పడంతో పాటు మీడియాలో ఆమెపై ఇంకా కథనాలు ఉంటే తొలగించాలంటూ ఆదేశించడం జరిగింది.