ఎక్కడైనా బికినీ డ్రెస్సులు వేసుకోవాలని కూతురిని ప్రోత్సహించే తల్లులను చూశారా? మనం చూడకపోయి ఉండొచ్చు. అంతే తప్ప అలాంటి తల్లులు లేకపోలేదు. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లవి మరి. కూతురిని బికినీ వేసుకునేలా ప్రోత్సహించడమే కాదు, అందులో పాఠాలు కూడా చెప్పే తల్లి గురించి మనమిప్పుడు తెలుసుకుందాం.
‘మిస్ ఇండియా ఆడిషన్స్‌కి వెళ్లాలంటే బికినీ డ్రెస్‌లు వేసుకోవాలి. అది నచ్చక రెడీ కాలేదు. కానీ మిస్ ఇండియా ఆడిషన్స్ వెళ్లమని అమ్మ (రినీ సింగ్) ప్రోత్సహించింది. నేను సిగ్గుపడుతూ బికినీ డ్రెస్‌లు ధరించడం ఇష్టం లేదని చెప్పాను. కానీ మా అమ్మ దాన్ని తేలికగా తీసుకుంది. బికినీలో ఏముంది? రెడీ కమ్మని క్యాజువల్‌గా చెప్పింది’….అని అగ్రహీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, మిస్ ఇండియా పోటీలతో పాటు బికినీ ధరించే విషయంలో తనను అమ్మ ఎంతో ప్రోత్సహించిందని కూడా ఆమె వెల్లడించారు.
ఇటీవల రకుల్ తన తల్లితో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. హీరోయిన్ అయ్యే శక్తిసామర్థ్యాలు తన కుమార్తెలో ఉన్నాయని ముందే గ్రహించినట్టు రినీ సింగ్ తెలిపారు. రకుల్ మాట్లాడుతూ మన సమాజంలో చాలా మంది పిల్లలకు తల్లిదండ్రుల నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదన్నారు. కానీ తనకు ఆ సమస్య ఎప్పుడూ ఉత్పన్నం కాలేదన్నారు. అమ్మానాన్నల నుంచి కావాల్సినంత సపోర్ట్ లభిస్తోందన్నారు.
ఇంకా బికినీలపై అనేక విషయాలు మాట్లాడారు. తాను బికినీ వేసుకోగలనని తల్లిదండ్రులు కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు ఆమె చెప్పారు. అలాగే బికినీలు కొనడానికి వెళ్లేటప్పుడు ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలో అమ్మ చెబుతుందన్నారు. ‘నేనూ రావాలా?’ అని ఒకసారి అమ్మ అడిగిందని రకుల్ తెలిపారు.