‘ఆర్ఆర్ఆర్’ – రామరాజు తోరొమాన్స్ కి అలియా సిద్ధం.!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెలుగు స్టార్ హీరోస్ ఎన్.టి.ఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్సన్, అలిసన్ డూడి, ఒలీవియా మోరిస్ లతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ లాంటివారు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే స్థాయిలో ఉన్నాయి.

కోవిడ్ కారణంగా దాదాపు 6 నెలల పాటు షూటింగ్ ఆపేసిన ఈ చిత్ర టీం రీసెంట్ గా షూటింగ్ మొదలుపెట్టి, అక్టోబర్ 22న ఎన్.టి.ఆర్ టీజర్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇదిలా ఉంచితే ఇప్పటికే అలియా భట్ షెడ్యూల్ ని పలు సార్లు వాయిదా వేశారు, తీరా అన్నీ సెట్ అయ్యాయి అనుకునే టైంకి కోవిడ్ వచ్చి షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం మొదట ‘ఆర్ఆర్ఆర్’ ఫినిష్ చేశాకే తన తదుపరి కొత్త సినిమాలను ప్రారంభించాలని అలియా డిసైడ్ అయ్యిందట.

అందుకే అలియా ఈ సారి ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ ఛాయస్ గా తీసుకున్నారు. నవంబర్ నుంచి జరిగే షెడ్యూల్ లో అలియా భట్ జాయిన్ కానుంది. అలాగే తన షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకూ అలియా భట్ హైదరాబాద్ లోనే ఉండనుంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ మరియు అలియా భట్ ల మీద వచ్చే పూర్తి సన్నివేశాలను షూట్ చేయనున్నారు. దాదాపు నెల రోజులు జరిగే ఈ షెడ్యూల్ తో సినిమాలోని మేజర్ పార్ట్ పూర్తవుతుందని సమాచారం. అందుకే ఈ సారి ఎవరి కారణంగా షూటింగ్ ఆగకుండా షెడ్యూల్ ని పగడ్బందీగా ప్లాన్ చేశారు. అనుకున్న దాన్ని ప్రకారం ఈ ఏడాదికల్లా షూటింగ్ ఫినిష్ చేయాలనే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉంది.