సౌత్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు ఒక సినిమాను నిర్మించబోతున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న విషయం తెల్సిందే. సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు వందల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా గురించిన ఏదో ఒక పుకారు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా మరో విషయం పెద్ద ఎత్తున ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.
ఈ ప్రతిష్టాత్మక మూవీలో మెగాస్టార్ చిరంజీవి కూడా కనిపించే అవకాశం ఉంది అంటున్నారు. మెగా స్టార్ చిరంజీవి మరియు చరణ్ లు ఇప్పటికే ఆచార్యలో నటిస్తున్నారు. ఆచార్య సినిమాలో చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పుడు చరణ్, శంకర్ మూవీలో చిరంజీవి గెస్ట్ రోల్ ను మించి కాస్త ముఖ్యమైన పాత్రను చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవి మరియు రామ్ చరణ్ లు ఉంటే ఖచ్చితంగా సినిమా మరో లెవల్ లో ఉంటుంది. అందుకే దిల్ రాజు ఇలా సెట్ చేశాడనే వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ ప్రచారంపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.